త్వరలోనే హీరోయిన్ సమంత పాన్ ఇండియా స్టార్ గా మారబోతుంది. నవంబర్ 11న ఆమె నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "యశోద" విడుదలవుతుందనే విషయం తెలిసిందే కదా. హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాక సమంత పాన్ ఇండియా క్రేజ్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుక్కునేందుకు భారీ ధరను చెల్లించినట్టు తెలుస్తుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... యశోద థియేట్రికల్ రైట్స్ 12 కోట్లు, ఓవర్సీస్ రెండున్నర కోట్లు, నార్త్ రైట్స్ మూడున్నర కోట్లు, శాటిలైట్ రైట్స్ 13 కోట్లు, డిజిటల్ రైట్స్ 24 కోట్లు మొత్తంగా...ప్రపంచవ్యాప్తంగా 55కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. అంటే పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే కానీ, 55 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను మిగల్చగలదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa