శివ నిర్వాణ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత కలిసి జంటగా నటిస్తున్న చిత్రం "ఖుషి". మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
లైగర్ సినిమా కారణంగా పోస్ట్ పోన్ ఐన ఖుషి షూటింగ్ సమంత అనారోగ్యం కారణంగా మరింత ఆలస్యమవుతుంది. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోని ఈ మూవీ అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖుషి మూవీ అన్ని భాషల హక్కులు 90కోట్ల భారీ ధరకు హాట్ కేకుల్లా అమ్ముడైనట్టు టాక్. విజయ్, సమంతల క్రేజీ కాంబోనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది.
ఇంకా ఐదు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉన్న ఈ సినిమా న్యూ షెడ్యూల్ ను త్వరలోనే స్టార్ట్ చేసి, డిసెంబర్ 23నాటికి థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa