ఒక సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమా థియేట్రికల్ బిజినెస్, థియేటర్ కౌంట్, ఓవర్సీస్ బిజినెస్, డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఇలా.... ఎన్నో అంశాలపై కొంతమంది ఆడియన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఓవర్సీస్ లో విడుదలైన సినిమాల ప్రీ బిజినెస్ రికార్డ్స్ అన్నిటినీ తలదన్నేలా సలార్ మరియు పుష్పరాజ్ లు బిజినెస్ చేసుకుంటున్నారని ఒక వార్త మీడియాలో హల్చల్ చెయ్యడంతో, ఆల్రెడీ భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఎక్కువైపోతోంది. ఈ మేరకు సలార్, పుష్ప ది రూల్ సినిమాల హక్కులను సొంతం చేసుకునేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని కోట్ చేస్తున్నారట. ఈ మొత్తం ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాలకు ఓవర్ సీస్ లో దక్కని బిజినెస్ జరగనుందట. ఐతే, ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa