నటసింహం నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో కలికితురాయిలా నిలిచిపోయే ఎవర్ గ్రీన్ క్లాసిక్ "ఆదిత్య 369". సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఐకానిక్ మూవీ సీక్వెల్ కూడా రావాలని నందమూరి అభిమానులు ఉత్సాహపడుతున్నారు. ఐతే, ఈ విషయంపై బాలయ్య తొలిసారిగా అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ... ఆదిత్య 369 సీక్వెల్ పై ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే సీక్వెల్ తో ప్రేక్షకులను అలరిస్తానని చెప్పారు. విశేషమేంటంటే ఈ మూవీ టైటిల్ "ఆదిత్య 999 మ్యాక్స్" అని కూడా చెప్పేసి, ప్రేక్షకాభిమానులను విస్మయపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa