కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం "సార్". తెలుగులో మంచి ఫాలోయింగ్ అండ్ మార్కెట్ ఉన్న ధనుష్ నుండి రాబోతున్న తొలి డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలామంచి అంచనాలున్నాయి.
లేటెస్ట్ గా మేకర్స్ సార్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 10వ తేదీన తొలి పాటను విడుదల చేస్తామని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రిగారు ఈ పాటకు లిరిక్స్ రాయగా తమిళంలో స్వయంగా ధనుష్ లిరిక్స్ రాయడం విశేషం.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa