వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తెలుగు ద్విభాషా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళంలో "వాతి" అని తెలుగులో "సర్" టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల ఆలస్యం కారణంగా 'సర్' సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తాజా సమాచారం.
లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2023న విడుదల అవుతుంది అని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్త పై మూవీ మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావలిసిఉంది. ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa