నిన్న ఉదయం విడుదలైన హిట్ 2 టీజర్ కి యూట్యూబులో వీక్షణల వెల్లువ కురుస్తుంది. ఇంకా ఒక రోజు కూడా గడవక ముందే ఈ టీజర్ కు 5. 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 125కే లైక్స్ తో ఈ టీజర్ యూట్యూబ్ #1 పొజిషన్ ని ఆక్రమించింది. దీంతో హిట్ 2 టీజర్ పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపిస్తున్నారని అర్ధమవుతుంది.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ సినిమాలో అడివిశేష్ హీరోగా నటించారు. శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరించారు. డిసెంబర్ 2వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, కోమలీ ప్రసాద్, శ్రీనాధ్ మాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa