హీరో నవీన్ చంద్ర, దివ్యా పిళ్ళై జంటగా నటించిన చిత్రం "తగ్గేదేలే". దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు డైరెక్షన్లో లవ్, రొమాన్స్, రివెంజ్, యాక్షన్.. అంశాల కలయికలో రూపొందిన ఈ చిత్రం రేపు థియేటర్లలో విడుదల కాబోతుంది.
2012లో వచ్చిన దండుపాళ్యం సినిమాతో బాగా ఫేమస్ ఐన శ్రీనివాసరాజు నుండి రాబోతున్న చిత్రం కావడం, ఇందులో కూడా దండుపాళ్యం బ్యాచ్ కీలకపాత్ర పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, అఖిలేష్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అనన్యా రాజ్, రవి శంకర్, పూజా గాంధీ, మకరంద్ దేశ్ పాండే, రాజా రవీంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa