ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధీర్ "గాలోడు" థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 02:33 PM

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "గాలోడు". ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చెయ్యగా, సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయనే నిర్మించారు.


నవంబర్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం తొమ్మిదింటికి గాలోడు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
 
భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గెహనా సిప్పి  హీరోయిన్ గా నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa