ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి 67 : విజయ్ ను ఢీకొట్టే ప్రతినాయకుడిగా 'పందెం కోడి' హీరో

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 06:55 PM

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తలపతి విజయ్ నటించిన 'మాస్టర్' గతేడాది తెలుగు, తమిళ భాషలలో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతుంది.


విజయ్ కెరీర్ లో 67వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా తలపతి 67 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై తాజా సమాచారం ఏంటంటే, కోలీవుడ్ స్టార్ హీరో, పందెం కోడి, పొగరు, పిస్తా వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన విశాల్ విజయ్ కు ధీటుగా నిలిచే విలన్గా నటించబోతున్నాడట. ఈ మేరకు లోకేష్ విశాల్ ను కలిసి కథ కూడా చెప్పాడంట. మరి, విశాల్ ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ విశాల్ ఒప్పుకుంటే క్రేజీ కోలీవుడ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదవ్వడం ఖాయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa