బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్ ప్రస్తుతం మిలీ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మథుకుట్టి క్సేవియర్ డైరెక్షన్లో సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ... సౌత్ సినిమాలలో నటించాలన్న తన కోరికను మరొకసారి బయటపెట్టింది. చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలను చూస్తూ పెరిగిన తనకు ఎప్పుడెప్పుడు సౌత్ సినిమాలలో నటిస్తానా అని ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తో పని చెయ్యాలని ఇదివరకు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పింది.
ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా కాబట్టి జాన్వీని తీసుకునే అవకాశాలున్నాయని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా హీరోయిన్ పై ఎలాంటి క్లారిటీ లేదు. మరి, జూనియర్ ఎన్టీఆర్ తో పని చెయ్యాలన్న జాన్వీ కోరికను కొరటాల శివ నెరవేరుస్తాడేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa