టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ "అహ నా పెళ్ళంట" వెబ్ సిరీస్ తో ఓటిటిలోకి డిబట్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే కదా. తాజాగా ఈ రోజు ఈ వెబ్ సిరీస్ యొక్క టీజర్ విడుదలైంది. అలానే ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కాబోతుందన్న విషయంపై కూడా అఫీషియల్ క్లారిటీ లభించింది. నవంబర్ 17 నుండి జీ 5 ఓటిటిలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది.
శివాని రాజశేఖర్ ఈ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తుంది. సంజీవి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ను జీ 5 మరియు తమడా మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఆమని, పోసాని కృష్ణమురళి కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa