దాదాపు పుష్కర కాలం తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుందంటే, ప్రేక్షకాభిమానుల దృష్టి మొత్తం ఈ సినిమాపైనే ఉంది. అతడు, ఖలేజా కమర్షియల్ సక్సెస్ కాకున్నప్పటికీ వాటిలో ఉండే మ్యాజిక్కే వేరు. అలాంటి మ్యాజిక్ తిరిగి రిపీట్ అవ్వాలని, ఈసారి కమర్షియల్ సక్సెస్ కూడా తోడు కావాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వచ్చే వారం నుండే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ఒకటుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఈ రోల్ కు యంగ్ హీరోయిన్స్ శ్రీ లీల, కృతిశెట్టి, అనుపమ పరమేశ్వరన్, ప్రియాంక అరుళ్ మోహన్... ఇలాంటి పేర్లు వినిపించాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సెకండ్ హీరోయిన్ రోల్ కి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. మలయాళ కుట్టి, సత్యదేవ్ హీరోగా నటించిన 'గాడ్సే' తో తెలుగు తెరకు పరిచయమైన ఐశ్వర్య లక్ష్మి ఈ రోల్ కు ఎంపికైనట్టు టాక్. మరి ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది.
ఇటీవలే విడుదలై గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో సముద్రకుమారిగా నటించి, విశేషంగా మెప్పించింది ఐశ్వర్య లక్ష్మి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa