ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే వారం నుండే "పుష్ప2" రెగ్యులర్ షూటింగ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 05:48 PM

పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్న చిత్రం "పుష్ప 2". సుకుమార్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించారు.


తాజా సమాచారం మేరకు వచ్చే వారం నవంబర్ 7 నుండి పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారని వినికిడి. ఈ షెడ్యూల్ లో ఐకాన్ స్టార్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.


తెలుగుతో పాటు హిందీలో కూడా భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఈసారి మరింత భారీగా తెరకెక్కబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa