కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ తదుపరి సినిమా "18 పేజెస్" కనిపించనున్నారు. చాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్ర బృందం తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెట్స్‌లో నిఖిల్ జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa