ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ విడుదల చేసిన "లైక్ షేర్ సబ్స్క్రైబ్" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 12:05 PM

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న "లైక్ షేర్ సబ్స్క్రైబ్" థియేట్రికల్ ట్రైలర్ ను కొంచెంసేపటి క్రితమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిజిటల్ లాంచ్ చేసారు.


నవంబర్ నాల్గవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసారు. ట్రావెల్ నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమ కథ, ఈ ప్రేమ కథ నక్సలైట్ల చేతికి ఎలా చిక్కింది? అందుకు జరిగిన పరిణామాలేంటి? చివరకు హీరో హీరోయిన్ల ప్రేమ కథ ఏమైంది? అనే విషయాలకు హిలేరియస్ కామెడీని జత కుదిర్చిన ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.


నెల్లూరు సుదర్శన్, బ్రహ్మాజీ, మైమ్ గోపి, సప్తగిరి, బబ్లూ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa