అభిషేక్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రామసేతు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ 2 గంటల 24 నిమిషాల రన్‌టైమ్ ను కలిగి ఉంది అని సమాచారం.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ఫిల్మ్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa