ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి ఈ దీపావళికి బిగ్ సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. "ది మాడ్ మాన్ ఈజ్ కమింగ్ బ్యాక్" అనే పోస్టర్ ను విడుదల చేసారు. ఇదే పోస్టర్ ను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ కూడా విడుదల చేసింది. ఈ అన్ని విషయాలను పరిశీలించిన నెటిజన్లు ఖచ్చితంగా ఇది డీజే టిల్లు 2 ఎనౌన్స్మెంట్ అయ్యి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.
ఎందుకంటే, ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన డీజే టిల్లుని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలే నిర్మించాయి. గత కొంతకాలం నుండి డీజే టిల్లు సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాడు. సో, అక్టోబర్ 24వ తేదీన మధ్యాహ్నం 01:08 నిమిషాలకు ఈ సంస్థల నుండి రాబోయే ప్రకటన డీజే టిల్లు 2 ఎనౌన్స్మెంట్ గురించే అయ్యి ఉంటుందని సోషల్ మీడియా టాక్. చూడాలి మరి ఆ రోజు ఏం రివీల్ కాబోతుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa