ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాజమండ్రి రోజ్ మిల్క్' టీజర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 07:54 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నాని బండ్రెడ్డి తో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. జై జాస్తి, అనంతిక సనీల్‌కుమార్‌లు ఈ సినిమాలో ప్రధాన జంటగా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ 'రాజమండ్రి రోజ్‌మిల్క్' టీజర్‌ను విడుదల చేశారు.


స్కూల్ డేస్‌లోని అమాయక ప్రేమ సారాంశాన్ని ఈ టీజర్ తెలుపుతుంది. ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ టీజర్ ఆహ్లాదకరంగా అందరిని ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ ఈ కథకు మెచ్యూర్డ్ యాంగిల్ జోడించాడు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్‌లు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంట్రూప్ ఫిలింస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ మరియు అజయ్ అరసాద సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa