నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై జంటగా నటిస్తున్న చిత్రం "తగ్గేదేలే". దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు ఈ సినిమాకు దర్శకుడు కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మాటే మంత్రము అనే మెలోడియస్ మ్యారేజ్ సాంగ్ యొక్క ప్రోమో విడుదలైంది. క్లాసిక్ 'సీతాకోకచిలుక' మూవీలోని సూపర్ హిట్ మాటే మంత్రము సాంగ్ ని ఈ మూవీలో వాడుతున్నారు. లేట్ లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం, శైలజ ఆలపించిన ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామ మూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు అందించారు. ఈ పాట పూర్తిగా రేపు ఐదింటికి విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa