ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ 'ది లెజెండ్' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జెడి-జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా కథానాయికగా నటించింది.
తాజా అప్డేట్ ప్రకారం, శరవణన్ తన మొదటి చిత్రాన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. నటుడు-నిర్మాత శరవణన్ దీన్ని చిన్న స్క్రీన్‌లపై విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాజర్, ప్రభు, వివేక్, యోగి బాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాకు హరీష్ జైరాజ్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa