మొదటి రెండు లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్రబృందం తాజాగా థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు రేపు సాయంత్రం నాలుగింటికి 'కలిసుంటే' అనే లిరికల్ సాంగ్ విడుదల కాబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ నాల్గవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa