ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైసూరులో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న "NC 22"

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 12:42 PM

యువనటీనటులు అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా, కోలీవుడ్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఒక ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా.


గత కొన్ని రోజులుగా మైసూరులో ఈ మూవీ మేజర్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, మైసూరులో జరుగుతున్న NC 22 షెడ్యూల్ పూర్తయ్యింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ డేట్ ను ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.


అరవింద్ స్వామి, R శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జి అమరేన్, ప్రేమి విశ్వనాధ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళంలో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa