కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో చాలామంచి పేరును హోదాను సంపాదించుకున్నారు. ఈ నేపద్యంలో తెలుగు మార్కెట్ ను మరింత బలంగా మార్చుకునేందుకు శివ కార్తికేయన్ తొలి సారి నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "ప్రిన్స్".
టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో విపరీత అంచనాలను ఏర్పరిచిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి ఇంటరెస్టింగ్ పోస్ట్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది.
అదేంటంటే, డైరెక్టర్ వెంకట్ ప్రభుతో శివకార్తికేయన్ ఒక సినిమాను లాక్ చేసుకున్నారట. త్వరలోనే వీరిద్దరి కాంబోలో రాబోయే మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుందట. ఐతే ఈ సినిమా కంటే ముందుగా వెంకట్ ప్రభు నాగచైతన్యతో చేస్తున్న సినిమాను పూర్తి చెయ్యాల్సి ఉంది. అలానే శివ కార్తికేయన్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa