'కాంతార' సినిమా నుంచి 'వరాహ రూపం.. దైవ వరిష్ఠం' అనే పాటను గురువారం విడుదల చేశారు. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా తాజాగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైంది. ఈ పాటకు అజనీశ్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. ఆ పాటను దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు, ఆ పాత్రల్లో వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ పాటకు షాషిరాజ్ కవూర్ సాహిత్యం అందించగా, సాయి విఘ్నేష్ ఆలపించారు. హోం బాలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.