మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా నుండి ఒక మాస్ క్రాకర్ అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేస్తామని ఇటీవలే ఎనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా రిలీజ్ టైం ను కూడా ఫిక్స్ చేసి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు అక్టోబర్ 21 వ తేదీన అంటే రేపు ఉదయం 10:01 నిమిషాలకు ధమాకా మాస్ క్రాకర్ లాంచ్ కానుంది. అసలు ఇది ఏమై ఉంటుందా అని మాస్ రాజా ఫ్యాన్స్ ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa