చాన్నాళ్ల తరవాత అల్లువారి హీరో శిరీష్ నుండి నుండి రాబోతున్న కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రాకేష్ శశి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
నవంబర్ 4వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే టీజర్ విడుదలై, ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన తెచ్చుకుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు రేపటి నుండి ఒక్కో నగరంలో చిత్రబృందం పర్యటించనుంది. రేపు రాజమండ్రిలో పదకొండింటికి ఫ్యాన్స్ తో మీటింగ్, సాయంత్రం ఐదింటికి పాలకొల్లు, ఆరున్నరకు భీమవరం నగరాలలో ఊర్వశివో రాక్షసివో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa