నాచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా సినిమా నుండి 'ధూందాం దోస్తాన్' అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ పాట సందడి పీక్స్ లో ఉండగానే మేకర్స్ మరొక సూపర్ అప్డేట్ ను వదిలారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఉదయం 11:11 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa