యంగ్ హీరో సంతోష్ శోభన్ విభిన్న తరహా సినిమాలు చేసుకుంటూ, తనకంటూ యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన నటిస్తున్న మరొక విభిన్న తరహా చిత్రం "లైక్ షేర్ సబ్స్క్రైబ్".
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు కాగా, నెల్లూరు సుదర్శన్, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa