ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా 153 : మెగా మాస్ కు తోడవుతున్న మరో ఇద్దరు స్టార్ హీరోలు..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 04:30 PM

బాబీ డైరెక్షన్లో త్వరలోనే మెగా మాస్ తుఫాన్ థియేటర్లను తాకనుంది. అదేనండి... మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ "మెగా 153" త్వరలోనే విడుదల కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ లో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వారెవరంటే, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. ఈ మధ్యనే నాగార్జున "బ్రహ్మాస్త్ర" లో నంది అస్త్రగా కీరోల్ లో నటించారు. వెంకటేష్ గారు త్వరలోనే విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" సినిమాలో లవ్ జడ్జి గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మెగాస్టార్ సినిమాలో కీరోల్ పోషించబోతున్నారనడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa