బుల్లితెర నటుడు ఆదర్శ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గీతసాక్షిగా'. చిత్ర శుక్ల ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంథోనీ మట్టిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు.
పోస్టర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నుండి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 22న సాయంత్రం ఐదింటికి ఈ మూవీ టీజర్ రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa