ఆదిపురుష్ లో కృతిసనన్, ప్రాజెక్ట్ కే లో దీపికా పదుకొణె వంటి యంగ్ బాలీవుడ్ బ్యూటీలతో జత కడుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న చిత్రం "స్పిరిట్". ప్రభాస్ సినీ కెరీర్ లో ఇది 25 వ చిత్రం. గతేడాది అధికారికంగా ప్రకటింపబడిన ఈ సినిమా విషయమై లేటెస్ట్ అప్డేట్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ నటించబోతున్నట్టు టాక్. ఈ మేరకు స్పిరిట్ మేకర్స్ కరీనాను కలిసి చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది.
ఈ వార్తలు కరీనా వరకు వెళ్లినట్టున్నాయి. అందుకే ఆమె రెస్పాండ్ అయ్యి, ప్రభాస్ కు సంబంధించిన ఏ సినిమాలో కూడా తాను హీరోయిన్ గా నటించట్లేదని, మేకర్స్ ఎవ్వరూ తనను సంప్రదించలేదని వివరించింది. ఫ్యూచర్ లో ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa