శివశ్రీ మీగడ దర్శకత్వంలో నివాస్ సిస్తు, సారా ఆచార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రహస్య' సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. NIA అధికారి విశ్వ తేజగా ఈ సినిమాలో నివాస్ కనిపించనున్నాడు. సారా ఆచార్ నివాస్ సబార్డినేట్‌గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. రహస్య చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించగా, సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాని ఎస్‌ఎస్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమి ఎస్ నిర్మించారు. రాజేష్ సిహెచ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa