బ్రహ్మస్త్ర ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లిన రాజమౌళి…రజనీకాంత్‌ని ఒక్క రోజైనా డైరెక్ట్ చేయాలని ఉందన్నాడు. తమిళ హీరోలతో ఎవరితో కలిసి పనిచేయాలని ఉందన్న ప్రశ్నకి రాజమౌళి చెప్పిన సమాధానం ఇది. మామూలుగా అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ…గతంలోనూ ఒక సందర్భంలో రాజమౌళి రజనీకాంత్‌తో చేయాలని ఉందని చెప్పారు. దీంతో…ఈ కాంబినేషన్ సెట్ అవడానికి అసలు ఏమన్నా చాన్స్ ఉందా అన్న చర్చతో రజనీకాంత్, రాజమౌళి ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు. అయితే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం మహేశ్‌తో సినిమా తీసే పనిలో ఉన్నాడు రాజమౌళి. త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుంది. ఈ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి ఎంత లేదన్నా మూడేళ్లకి తక్కువ టైమ్ అయితే పట్టదు. అంటే మహేష్ బాబుతో సినిమా అయిపోయి మరో సినిమాకి రాజమౌళి సై అనాలంటే కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. ఈ లోపు రజనీకాంత్ డేట్స్ ఖాళీ లేకపోయినా…ఇటు రాజమౌళి మరొక ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా…మళ్లీ కథ మొదటి కే వస్తుంది. దీంతో…జస్ట్ స్టేట్‌మెంట్ వరకే రాజమౌళి పరిమితం అవుతారా? లేక రజనీకాంత్ దాకా విషయాన్ని తీసుకెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa