ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరుణకుమార్‌ మార్కు సినిమా ‘కళాపురం’ఇలా ఉంటుంది .

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 04:34 PM

స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను నటీనటులుగాను: కరుణకుమార్‌ దర్శకత్వం లో రూపొందిన చిత్రం  కళాపురం సమర్పణ: జీ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ: ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాత : ర‌జనీ తాళ్లూరి సంగీతం: మణిశర్మ అందించారు ఇక కథ విషయానికి వస్తా  నమ్మిన కథను చేతబట్టుకుని రోజుకో నిర్మాత చుట్టూ తిరిగే అస్టిస్టెంట్‌ డైరక్టర్‌. హీరోయిన్‌ కావాలని కలలు కంటూ అక్కడే ఉండే ఒకమ్మాయి. వారిద్దరి మధ్య ప్రేమ. అవకాశాల కోసం ఆమె కేరక్టర్‌లో మార్పులు. అది గమనించి అతను ఆమెను ప్రశ్నించడం, బాధపడటం. వారిద్దరూ విడిపోవడం. సరిగ్గా అదే సమయానికి అతనికి ఓ డైరక్షన్‌ ఛాన్స్ రావడం. కళాపురానికి బస్‌ ఎక్కడం. కళాపురంలో అడుగుపెట్టగానే ఎలక్షన్‌ కోడ్‌ పేరుతో అతని దగ్గరున్న డబ్బును పోలీసులు సీజ్‌ చేయడం. అక్కడి నుంచి ఓ చిన్న జర్నీ… కళాపురానికి చెందిన ఓ అమ్మాయి ఇచ్చిన ప్రోత్సాహంతో, అందుబాటులో ఉన్న వనరులతో అతను నాగేశ్వరి అనే సినిమా చేయడం, అనూహ్యంగా అది జనాలకు నచ్చడం, ఆఖరికి అదంతా ఓ పొలిటికల్‌ స్కెచ్‌ అని తెలియడం అలాగే  అక్కడక్కడా సిట్చువేషనల్‌ కామెడీతో, డైలాగులతో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. లొకేషన్లు నేచురల్‌గా ఉన్నాయి.  సినిమాలో తరవాత  ఏం జరుగుతుందో జనాల అంచనాలకు అందడంతో పెద్ద ఇంట్రస్ట్ క్రియేట్‌ చేయలేకపోయింది. సినిమా స్టార్టింగ్‌లో చెప్పే దెయ్యాల కథ, ఆ వెంటనే కనిపించే విలన్‌ ఎంట్రీ సీన్లను తర్వాత సస్టెయిన్‌ చేయలేకపోయారు. జబర్దస్త్ అప్పారావు బాబా కేరక్టర్‌ ఎందుకో అర్థం కాదు. ప్రొడ్యూసర్‌ అప్పారావు కేరక్టర్‌కి మంచి నటుడు దొరికారు. సరదాగా చూడాలనుకుంటే చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa