క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని 2023 మార్చి 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఏఎం రత్నం మీడియాకు తెలిపారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందని ఏఎం రత్నం ఫాన్స్ కి భరోసా ఇచ్చారు. హరి హర వీర మల్లు సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa