డైరెక్టర్స్ హరీష్ శంకర్, బెక్కం వేణుగోపాల్ ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తదుపరి హీరోగా మారిన తేజ్ కూరపాటి నటిస్తున్న కొత్త చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా ..?'.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం ఐదింటికి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతుందని, వెటరన్ డైరెక్టర్ బి. గోపాల్ ట్రైలర్ లాంచ్ చేస్తారని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ చిత్రాన్ని వెంకట్ డైరెక్ట్ చేస్తుండగా, అఖిల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి కే. సందీప్ కుమార్ సంగీతం అందించారు. GVR ఫిలిం మేకర్స్, రాజధాని ఆర్ట్ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై ముల్లేటి కమలాక్షి, GVR ఈ సినిమాను నిర్మించారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa