‘పుష్ఫ : ది రూల్’ చిత్ర పూజా కార్యక్రమాన్ని ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించారు. శుభ ముహూర్తాన సీక్వెల్ ప్రారంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, మేకర్స్, చిత్ర యూనిట్ పాల్గొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి ‘పుష్ఫ : ది రైజ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా దీనికి సీక్వెల్ గా వస్తున్న Pushpa The Rule చిత్ర పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు.
సీక్వెల్ ఎప్పుడు ప్రారంభం కానుందోనని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, అభిమానులు ఈరోజు గ్రాండ్ గా జరిగిన ‘పుష్ఫ : ది రూల్’ పూజా వేడుకలతో కాస్తా ఖుషీ అవుతున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, చిత్ర యూనిట్ తోపాటు మూవీ మేకర్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు కెమెరా స్విచ్ ఆన్ చేసి, క్లాప్ కొట్టి ముహుర్తపు షాట్ ను ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమానికి అల్లుు అర్జున్ హాజరుకాలేకపోయారు. అమెరికాలో న్యూయార్క్ లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్వహించిన ‘ఇండియా డే’ పరేడ్ కు దేశం తరుఫున ప్రాతినిథ్యం వహిస్తూ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. దీంతో అల్లు అర్జున్ రాలేకపోయాడు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న కూడా షూటింగ్ బిజీతో హాజరు కాలేకపోయింది.
#PushpaTheRule starts off on an auspicious note with the Pooja Ceremony
Filming begins soon
BIGGER and GRANDER #ThaggedheLe #JhukegaNahi
Icon Star #AlluArjun #RashmikaMandanna #Pushpa2 #PushpaRaj pic.twitter.com/WXxN6dz59l
— Movie Lovers (@movielovers1021) August 22, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa