ఇంకా విడుదల కాకుండానే జనాల నోళ్ళల్లో తెగ నానుతున్న సినిమా "లైగర్". దేశవ్యాప్తంగా జరుగుతున్న లైగర్ ప్రమోషన్స్ కు ఫ్యాన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.
దీంతో ఈ మూవీకి సీక్వెల్ విషయంపై అప్పుడే కొన్ని వార్తలు ప్రచారంలోకొచ్చేశాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ విజయ్ దేవరకొండ ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని, ఐతే, దాని గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం అనవసరమని చెప్పారు. బాలీవుడ్ సూపర్ పాపులర్ షో "కాఫీ విత్ కరణ్ షో" లో విజయ్ ఈ వ్యాఖ్యలు చేసారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకు డైరక్టర్ కాగా, కరణ్ జోహార్, పూరి, చార్మీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనన్యాపాండే హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa