ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లైగర్' మూవీ నుండి నుండి న్యూ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 08:10 PM

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబోలో రానున్న 'లైగర్' మూవీ నుండి నుండి న్యూ అప్డేట్ వచ్చింది.  ఈ 'లైగర్' సినిమా ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడవనుంది. బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించే ఈ సినిమాలో ఆయన  జోడీగా అనన్య పాండే కనిపించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన రెండు సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు మూడో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు 'కోకా 2.0' సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ  అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ తరహా పాత్రలో ఆమె కనిపించనుండటం ఇదే ఫస్టు టైమ్. ఇతర ముఖ్యమైన పాత్రలలో రోనిత్ రాయ్ .. అలీ .. మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు. ప్రత్యేకమైన పాత్రలో మైక్ టైసన్ నటించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa