మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఏడాదిలో "గని" గా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘోర పరాజయాన్ని చవి చూసాడు. ఆపై ఎఫ్ 3 తో గ్రాండ్ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వరుణ్ సన్నద్ధమయ్యే క్రమంలో బిజీగా ఉన్నాడు.
ఈ రోజు రక్షా బంధన్ కావడంతో వరుణ్, నిహారికలు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు వరుణ్ కు నిహారిక రాఖి కడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో నిహారిక వరుణ్ కి రాఖి కట్టి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ సమయంలో నిహారికను పైకి లేవనీయకుండా వరుణ్ నిహారికపై చేయి ఉంచి కిందకే ఉంచుతాడు. ఈ వీడియో ఫన్నిగా, వరుణ్, నిహారికల స్ట్రాంగ్ బాండింగ్ కి అడ్డం పడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa