యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తుంది. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన అంటే రేపు విడుదల కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మాచర్ల నియోజకవర్గం మూవీ వరల్డ్ వైడ్ గా 940 పై చిలుకు థియేటర్లలో విడుదలవుతుంది. నైజాం - 235, సీడెడ్ - 125, ఆంధ్రా - 300, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - 80, ఓవర్సీస్ - 200+ కలుపుకుని మొత్తంగా 940 ప్లస్ థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మరి, రేపు ఈ సినిమా పట్ల ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa