బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం "లాల్ సింగ్ చద్దా". ఖాన్ తో కలిసి అక్కినేని నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా లో ఒక కీలక పాత్రను పోషించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్. లీడ్ రోల్ లో ఆమీర్ నటించగా, ఆయనకు జతగా కరీనా కపూర్ ఖాన్ నటించింది.
ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ పార్టర్న్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చింది. లాల్ సింగ్ చద్దా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ను వూట్ సెలెక్ట్ కైవసం చేసుకోవడంతో ఆ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. పోతే, ఈ చిత్రం ఆరు నెలల తరవాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కొస్తుందని ఆమిర్ ప్రమోషన్స్ సమయంలోనే ప్రకటించడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa