ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుల్లితెరపై "RRR" సందడి... టైమింగ్స్ ఏంటంటే?

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 04:11 PM

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ అడ్వెంచరస్ విజువల్ వండర్ "RRR". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ల నటవిశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులే కాక, దేశ, విదేశాల ప్రజలు సైతం ఫుల్ ఫిదా ఐన చిత్రమిది.మార్చి 25న విడుదలైన ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడవ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. వెండితెరపై, ఆ తరవాత ఓటిటి లో రికార్డు బ్రేక్ వ్యూస్ ను సాధించిన ఈ సినిమా లేటెస్ట్ గా టెలివిజన్ ప్రీమియర్ కి కూడా సిద్ధమైంది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన RRR స్మాల్ స్క్రీన్ పై ఆగస్టు 14వ తేదీన సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ఆగస్టు 14వ తేదీన తెలుగులో ప్రముఖ స్టార్ మా ఛానెల్ లో సాయంత్రం ఐదున్నరకు, హిందీలో జీ సినిమాస్ ఛానెల్ లో రాత్రి ఎనిమిదింటికి, మలయాళంలో ఏషియా నెట్ ఛానెల్ లో రాత్రి ఏడు గంటలకు RRR టెలికాస్ట్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa