ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సీతారామం" థాంక్యూ మీట్ కు చీఫ్ గెస్ట్ గా నాగార్జున

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 12:49 PM

యాక్షన్ అండ్ మాస్ సినిమాలు, హీరోల ఎలివేషన్ల ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్లో క్లాసిక్ లవ్ స్టోరీలు కూడా క్లిక్ అవుతాయని నిరూపించిన చిత్రం "సీతారామం". హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిషోతోనే సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతూ, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తుంది.
ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ తో మేకర్స్ ఒక సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa