బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియాభట్ నటించిన కొత్త చిత్రం "డార్లింగ్స్". ఈ సినిమాను అలియా తన సొంత బ్యానర్ ఐన ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ పై షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మించింది. ఈ చిత్రమే నిర్మాతగా ఆలియాకు మొదటి చిత్రం. డైరెక్ట్ ఓటిటిలో రిలీజైన ఈ చిత్రం ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆడియన్స్, క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తుండడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చెయ్యాలని ఆలోచిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే, షారుఖ్ ఖాన్ ప్రొడ్యూసర్ గా సౌత్ ఇండస్ట్రీ లోకి అఫీషియల్ ఎంట్రీ ఇచ్చినట్టే. ప్రస్తుతం ఈ రీమేక్ లకు సంబంధించి పలువురు సౌత్ డైరెక్టర్ లతో చర్చలు జరుగుతున్నాయట. సో, త్వరలోనే ఈ డొమెస్టిక్ వయోలెన్స్ బేస్డ్ డార్క్ కామెడీ తెలుగు ప్రేక్షకులను కూడా నవ్వించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa