ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీజే టిల్లు 2 లో అనుపమ పరమేశ్వరన్ ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 11:20 AM

డీజే టిల్లు క్యారెక్టర్ లో సిద్ధు జొన్నలగడ్డ ఇరగశిండు. టిల్లూ మాటలు, బాడీ లాంగ్వేజ్ , గెటప్ అన్నీ హిట్టే. టిల్లూగాని గర్ల్ ఫ్రెండ్ గా రాధిక పాత్రలో నేహా శెట్టి కూడా అద్భుతంగా నటించింది. బోల్ట్ సీన్స్ లో మరీనూ. డీజే టిల్లు కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ కు ఆయన దర్శకత్వం వహించడం లేదు. అతని స్థానంలో మల్లిక్ రామ్ (అద్భతం ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ నేహా శెట్టి కూడా 'డీజే టిల్లు 2' లో నటించడం లేదు. ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చే అవకా శాలు ఉన్నాయి. 'డీజే టిల్లు'లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. పార్ట్ 2లోనూ అవి కొనసాగే అవకాశాలున్నాయి. వాటికి అనుపమ ఓకే అంటే.. ఆమెను ఫిక్స్ చేయనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది డీజే టిల్లు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa