ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నేను మీకు బాగా కావాల్సినవాడిని" సెకండ్ సింగిల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 06:13 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం  "నేను మీకు బాగా కావాల్సినవాడిని". కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా, కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి కార్తిక్ శంక‌ర్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ వచ్చింది. "నచ్చావ్ అబ్బాయ్" అనే పార్టీ సాంగ్ ను ఆగస్టు 14వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa