ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్ #1 లో బుల్లెట్ వీడియో సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 05:51 PM

యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన "ది వారియర్" చిత్రంలోని బుల్లెట్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబులో ఈ పాట లిరికల్ వెర్షన్ తెలుగు, తమిళ భాషలలో కలిపి 200 మిలియన్ల మార్క్ ను దాటేసింది. లేటెస్ట్ గా ఈ పాట పూర్తి వీడియోను విడుదల చెయ్యగా, ఇది కూడా యూట్యూబులో మిలియన్లకొద్దీ వీక్షణలను రాబడుతూ దుమ్ము రేపుతోంది. ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ టాప్ ట్రెండింగ్ నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతుంది. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో రామ్ , కృతిశెట్టి లపై చిత్రీకరింపబడిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా, కోలీవుడ్ హీరో శింబు ఆలపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa