ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కళాపురం" నుండి కీరోల్ ఫస్ట్ లుక్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 05:21 PM

పలాస 1978, మెట్రో కధలు, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం "కళాపురం". ఇందులో సత్యం రాజేష్,  సంచిత పూనాచా, చిత్రం శ్రీను, ప్రవీణ్ యండమూరి, జనార్దన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, R 4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న ఖాశీమ రఫీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. త్వరగా హీరోయిన్ అయిపోయి, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చెయ్యాలని ఆరాటపడే అప్ కమింగ్, స్ట్రగ్లింగ్ హీరోయిన్ గా ఖాశీమ లుక్ ఇంటరెస్టింగ్ గా ఉంది. పోతే, ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa